దేశ ప్రధానిగా చంద్రబాబు ?

రాజకీయాల్లో ఎప్పుడూ ఏదైనా జరగొచ్చు. ఎవరికైనా అవకాశాలు వెతుక్కుంటూ రావొచ్చు. ఇప్పుడు అదే జరుగుతుంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా వెలువడుతున్న లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అనూహ్య ఫలితాలను సాధిస్తుందని చెప్పాలి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి 250 + స్థానాలను కైవసం చేసే దిశగా ఫలితాలు కనబడుతున్నాయి. మరోవైపు బీజేపీ కి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ వచ్చేలా కనబడటం లేదు. దీంతో ఎన్ డీయే మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ అత్యంత కీలకం కానున్నాయి.

ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాని మోడీ చంద్రబాబుకు ఫోన్ చేశారనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడకు బయలుదేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అవసరమైతే ఇండియా కూటమి చంద్రబాబుకు ప్రధాని పదవి ఆఫర్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగా కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు కు గాలం వేస్తే.. అంతకంటే ముందే బీజేపీ చంద్రబాబుకు బిగ్ ఆఫర్ చేసే అవకాశాలు  ఉన్నాయి. అది ప్రధాని పదవి అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు గానూ టీడీపీ కూటమి 160 స్థానాలను గెలుచుకోబోతుంది. మరోవైపు 25 ఎంపీ స్థానాలకు గానూ 20 కి పైగా సీట్లను కూటమిని కైవసం చేసుకోబోతుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కేంద్రంలో కింగ్ మేకర్ గా మారబోతున్నట్లు కనబడుతుంది.