అన్నీ పర్ఫెక్ట్.. కానీ !

మలయాళ హాట్ బ్యూటీ మాళవిక మోహనన్ పర్ ఫెక్ట్ ఫిగర్. గ్లామర్ హీరోయిన్ కి కావాల్సిన అన్ని కొలతలు ఆమె సొంతం. అందుకు తగ్గట్టుగానే ఆమెకు ఆఫర్లు కూడా వచ్చాయి. చేసిన డజను సినిమాలతో నాలుగు బాషలను కవర్ చేసింది. మలయాళం, కన్నడ, తమిళ్, హిందీ బాషల్లో నటించింది. విజయ్, దుల్కర్ సల్మాన్, ధనుష్ లాంటి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసింది. సీనియర్ సూపర్ స్టార్స్ స్టార్ రజనీకాంత్, మమ్ముట్టి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి జంటగా రాజా సాబ్ లో నటిస్తోంది.

ఈ ఫ్లో చూస్తే.. ఇప్పటికే మాళవిక స్టార్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోవాలి. కానీ అది జరగలేదు. ఎందుకంటే ? చేసిన సినిమాలు హిట్ కాలేదు. అయినా నిరాశ పడకుండా తన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. గ్లామర్ పరంగా వందకు వంద మార్కులు కొట్టేస్తున్న ఈ హాట్ బ్యూటీ.. నటన విషయానికొచ్చే సరికే అత్యసర మార్కులు తెచ్చుకుంటోంది. ఆ అందానికి నటన కూడా తోడైతే.. స్టార్ హీరోయిన్ లిస్టులో చేరిపోయేది. అయితే సోషల్ మీడియాలో మాత్రం మాళవిక స్టార్ హీరోయిన్ క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఫోటో షూట్స్ తో ఆకట్టుకుంటోంది. తాజాగా వైట్ స్లిట్ డ్రెస్ లో కవ్వించింది. ప్రస్తుతం మాళవిక బాలీవుడ్ సినిమా ‘యుద్ర’తో పాటు తెలుగులో రాజా సాబ్, తమిళ్ లో తంగిలాన్ లో నటిస్తోంది.