ఓటీటీలోకి ‘భారతీయుడు 2’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా 1996 లో వచ్చిన చిత్రం ‘భారతీయుడు’ బ్లాక్ బస్టర్  హిట్టైన సంగతి తెలిసిందే. ఇన్నాళ్ళకి ఈ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ ‘భారతీయుడు 2’ వచ్చింది. ఇటీవలే థియేటర్స్ లో రిలీజైన ఈ సినిమాకు మిక్సిడ్ టాక్ వచ్చింది. భారతీయుడు లో ఉన్న దమ్ము సీక్వెల్ లో లేదని, శంకర్ మార్క్ వర్కవుట్ కాలేదని కొందరు పెదవి విరిచారు. మరికొందరు మాత్రం బాగానే ఉందని చెప్పుబుతున్నారు. అయితే టాక్ తో సంబంధం లేకుండా భారతీయుడు 2 బాక్సాఫీస్ దగ్గర బాగానే కలెక్షన్స్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 

ఇదిలావుంటే.. ? ఇప్పుడు ఈ సినిమా #OTTRelease డేట్ ఫిక్సయింది.  ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఆగస్టు 9 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనుంది. థియేటర్స్ లో ఓ మాదిరిగా ఆడిన సినిమాలు ఓటీటీలో అదరగొడుతున్నాయి. శంకర్-కమల్ కాంబోలో వచ్చిన భారతీయుడు 2 ఓటీటీలో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు అంచనా వేస్తున్నారు.