ఆ కోరిక తీర్చుకుంది

ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే నటిగా తనని తాను నిరూపించుకుంది. మళయాళం, తమిళ్, తెలుగులోనూ స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఆమె హిందీ ఎంట్రీ ఫిల్మ్ బేబీ జాన్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అయితే స్టార్ హీరోయిన్ అంతకుమించి అనిపించుకున్న కీర్తి సురేష్ కి ఓ తీరని లోటు ఉంది. అదే గ్లామర్ డాల్. అవునూ.. గ్లామర్ హీరోయిన్ అనిపించుకోవాలనే బలమైన కోరిక కీర్తి లో బలంగా ఉంది. అందుకే మహానటి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఆమె అడుగులు గ్లామర్ రోల్స్ పై పడ్డాయి. అయితే గ్లామర్ హీరోయిన్ గా ఆమె సక్సెస్ కాలేదనే చెప్పాలి.

ఈ నేపథ్యంలో సినిమా ఫంక్షన్స్ లో కాసింత గ్లామర్ డోస్ చూపించే ప్రయత్నం చేస్తోంది కీర్తి. ఈ క్రమంలో ఆదివారం జరిగిన #69thSOBHAFilmfareAwardsSouth2024 లో ఈ ముద్దుగుమ్మ పిచ్చెక్కించింది. వైట్ కలర్ సూట్ లాంటి డ్రెస్ లో ఎద  అందాలతో రచ్చ చేసింది. మునుపెన్నడూ లేనంతగా కీర్తి గ్లామర్ షో చేయడం విశేషం. తనలోనూ కావాల్సినంత గ్లామర్ ఉంది. గ్లామర్ పాత్రలకు తాను రెడీ అని ఓపెన్ దర్శక నిర్మాతలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చేసింది. ఈ ఫోటోలు చూసిన సినీ జనాలు ఇకపై కీర్తికి గ్లామర్ పాత్రలు పరుగెత్తుకుంటూ వస్తాయని కామెంట్ చేస్తున్నారు. మరీ.. అదే నిజమైతే.. కీర్తి తన కోరిక తీర్చుకున్నట్టే.. !!