యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి ఐటీఐ/ ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీఐ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్)లను మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు ప్రారంభించాలని సూచించారు. ఈ కోర్సుల సిలబస్ రూపకల్పన కోసం నిపుణులు, విద్యావేత్తల సలహాలు తీసుకోవాలని, ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ప్రస్తుతం ఉన్న ఐటీఐ కళాశాలలకు ప్రిన్సిపాళ్లు ఉండేలా చూడాలని, శిక్షణ తీసుకుంటున్న వారికి సమగ్రమైన శిక్షణ అందేలా జాగ్రత్త పడాలని సూచించారు. అలాగే, పాలిటెక్నిక్ కళాశాలల్లో కొత్త ఏటీసీలను (అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్) ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. చర్యలు రాష్ట్రంలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడంలో కీలకంగా ఉంటాయని భావిస్తున్నారు.