వేట్టైయాన్ .. మ్యాజిక్ జరిగిందా ? 

సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన “వేట్టైయాన్ – ది హంటర్” సినిమా అక్టోబర్ 10న దసరా సందర్భంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించారు.

ఆడియో వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. రజినీకాంత్ మాట్లాడుతూ, సినిమా హిట్ కావాలంటే ఓ మ్యాజిక్ జరగాలని, జైలర్ మూవీ హిట్ తర్వాత కథలు వినడం మానేశానని చెప్పారు. జ్ఞానవేల్ చెప్పిన కథ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యానని తెలిపారు.

అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ మాట్లాడుతూ, రజినీకాంత్‌ను ఓ కొత్త ఇన్‌టెన్స్ క్యారెక్టర్‌లో చూస్తారని చెప్పారు.