పేదల కోణంలో కులగణన జరగాలి : రాహుల్ గాంధీ

పేదల కోణంలో కులగణన జరగాలని, కులగణన ద్వారా అభివృద్ధికి మార్గం ఏర్పడుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. మంగళవారం బోయిన్ పల్లిలోని గాంధీయన్ ఐడియాలజీ సెంటర్ లో కులగణన సంప్రదింపుల సదస్సుకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని దళితుల విషయంలో అంటరానితనం ఉందని.. ఇది ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. అందుకే బ్యూరోకటిక్ కులగణనన వద్దు…పేదల కోణంలో కులగణన జరగాలి రాహుల్ ఆకాంక్షించారు.

912 లో పెద్ద నౌక టైటానిక్ యూకే నుంచి అమెరికా బయలుదేరింది. టైటానిక్ షిప్  ను తయారు చేసిన వాళ్లు మునగదని చెప్పారు. కానీ కొన్ని వారాల్లో మంచు గడ్డ ను ఢీకొట్టిన టైటానిక్  మునిగిందని రాహుల్ గుర్తు చేశారు. 90 శాతం మంచు గడ్డలు సముద్రం లోపల ఉంటాయి. అందుకే గమనించలేకపోయారు. అదే విధంగా మనదేశంలో  కులవివక్ష సముద్రం లోపల ఉన్న మంచుగడ్డ లాంటిది. ప్రజలకు కనిపించకుండా కులవివక్ష ఉంటుందని రాహుల్ వివరించారు.

 కులగణనన ద్వారా వ్యవస్థలను సరిచేయొచ్చని రాహుల్ అన్నారు. అన్నిచోట్లా కుల వివక్ష ఉంది. రాజకీయ, న్యాయ, కార్పొరేట్ వ్యవస్థలలో కూడా ఉంది. ఆత్మవిశ్వాసాన్ని కులవివక్ష దెబ్బ తీస్తుందన్నారు. కులగణనను ఎక్స్ రే లా చూస్తున్న… కులవివక్ష ఉందని ఒప్పుకోవాలి… కులగణన చేయమన్నందుకూ సమాజాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నాని బీజేపీ, మోదీ అంటున్నారు. నిజం చెప్పడం విభజించడమా అని రాహుల్ నిలదీశారు. కులగణనతో  ఎంత మంది దళితులు, ఆదివాసీలు, ఓబీసీ లు ఉన్నారో తేలుతుంది. దాని ద్వారా నిధులను పంచుతాం. కులగణనకు వ్యతిరేకంగా ఉన్నవారు.. కులవివక్షతకు అనుకూలంగా ఉన్నవారేనని మండిపడ్డారు. ఎందుకు కులగణనకు  మోడీ భయపడుతున్నారని రాహుల్ ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో కులగణన చేస్తామని పార్లమెంట్ లో చెప్పాను. కులగణన విషయంలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా ఉండాలని రాహుల్ గాంధీ ఆకాంక్షిమ్చారు. బ్యూరోకటిక్ కులగణన వద్దు…పేదల కోణంలో కులగణన జరగాలని సూచించారు. కులగణనన లో కొన్ని పొరపాట్లు జరగొచ్చు..కానీ సరిచేసుకుంటామని రాహుల్ హామీ ఇచ్చారు.