విశాల్’తో పెళ్లి విషయం చెప్పిన వరలక్ష్మీ
కోలీవుడ్ లో విశాల్-వరలక్ష్మీ లింకు పెడుతూ బోలోడు ప్రచారం జరిగింది. జరుగుతోంది కూడా. వీరిద్దరు పీకల్లోతూ ప్రేమలో ఉన్నారు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబుతున్నారని చెప్పుకొన్నారు. మధ్యలో ఒకట్రెండు సార్లు ఈ జంట బ్రేకప్ చెప్పుకుందనే పుకార్లు షికారు చేశారు. ఆ తర్వాత మళ్లీ కామన్ నే. విశాల్-వరలక్ష్మీ దాదాపు భార్యభర్తలే అన్నట్టుగా మాట్లాడారు.
దీనిపై వీరిద్దరు మాత్రం ఆచితూచి స్పందించారు. మేం స్నేహితులం మాత్రమేనని పలుమార్లు స్పష్టం చేశారు. ఈ మధ్య వరలక్ష్మీ ఒకటికి రెండు సార్లు చెప్పింది. వీరిద్దరు కలిసి నటించిన పందెంకోడి2 దసరా పండగ రోజున (అక్టోబర్ 18) ప్రేక్షకుల ముందుకొచ్చి.. పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొంది. ఇందులో వరలక్ష్మీ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టింది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న వరలక్ష్మీ మరోసారి విశాల్ పెళ్లిపై స్పందించింది. విశాల్ ని పెళ్లి చేసుకోమని తాను పలుమార్లు చెప్పా. వయసు అయిపోతే ఎవరు పిల్లని ఇవ్వరని కూడా చెప్పా. విశాల్ మాత్రం నడిగర్‌సంఘం భవన నిర్మాణం పూర్తయిన తరువాతనే పెళ్లి చేసుకుంటాననే చెబుతున్నాడని చెప్పుకొచ్చింది. మరోవైపు, ఈ మధ్య కీర్తి సురేష్ తో లింకుపెడుతూ విశాల్ పేరు వినిపిస్తోంది. బహుశా.. ఆమెని పెళ్లి చేసుకోమనే వరలక్ష్మీ సూచించినట్టుందేమో.. !