ఎన్టీఆర్ లుక్’పై రాజమౌళి సూచనలు


ఎన్టీఆర్ కోసం రాజమౌళి రంగంలోకి దిగారు. తారక్, చరణ్ లతో రాజమౌళి మల్టీస్టారర్ రాబోతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 18న సినిమా ప్రారంభం కానుంది. మొదట తారక్, ఆ తర్వాత చరణ్ షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ఈ సినిమా కోసం తారక్ కొత్త లుక్ లోకి మారబోతున్నాడు. ఇటీవల ఎన్టీఆర్‌ వ్యక్తిగత ఫిట్‌నెస్‌ శిక్షకుడు లాయిడ్‌ స్టీవెన్స్‌ రాజమౌళితో సమావేశమయ్యారు. ఎన్టీఆర్‌ లుక్‌ కోసం వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చలు సాగించారని తెలుస్తోంది. తారక్ లుక్’పై రాజమౌళి సూచనలు చేశారన్న మాట.

దొబ్బుగా ఉన్న ఎన్టీఆర్’ని కరెంట్ తీగలా మార్చిన ఘనత రాజమౌళిది. ‘యమదొంగ’ కోసం తారక్ తొలిసారి సన్నబడ్డాడు. ఇక, టెంపర్ సినిమా నుంచి ఆయన ప్రతి సినిమాలోనూ కొత్త లుక్ లో కనబడుతున్నారు. అరవింద సమేత కోసం సిక్స్ ప్యాక్ చేశారు. ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం కొత్త అవతారంలోకి మారబోతున్నాడు. అదెలా ఉండబోతుందన్నది చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చరణ్‌ లుక్‌ కూడా విభిన్నంగా ఉండబోతోందని సమాచారం. స్క్రిప్టు పనులు దాదాపుగా పూర్తయ్యాయట. హీరోయిన్, ఇతర తారగణం ఎంపిక జరుగుతోంది.