‘వీర భోగ వసంత రాయలు’ పబ్లిక్ టాక్

ఇంద్రసేన దర్శకత్వంలో నారా రోహిత్, సుధీర్‌ బాబు, శ్రీవిష్ణు, శశాంక్, శ్రియలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘వీర భోగ వసంత రాయలు’. ఇదో క్రైమ్ థ్రిల్లర్. ఇందులో శ్రీవిష్ణు గ్రహాంతర వాసింగా కనిపించబోతున్నట్టు ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఆయన ఢిఫరెంట్ లుక్ లో కనిపించారు. విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడిన ఈ మల్టీస్టారర్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. ఇప్పటికే ఉదయం పూట ఆట పడిపోయింది. మరీ.. పబ్లిక్ టాక్ ఎంటో.. ? చూద్దాం పదండీ.. !

ఈ క్రైమ్ థ్రిల్లర్ ని ఆసక్తికరంగా ప్రారంభించాడు దర్శకుడు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న దురాఘాతాలను చూపిస్తూ సినిమాని ప్రారంభించాడు. ఆ తర్వాత సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా, నారా రోహిత్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దీపక్ గా పరిచయం చేశాడు. శ్రీ విష్ణు సీరియల్ కిల్లర్ గా పరిచయం చేయడంతో కథని సీరియస్ మూడ్ లోకి తీసుకెళ్లాడు. ప్రైవేట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా శశాంక్, శ్రీయ శరణ్ ఇన్స్పెక్టర్ నీలిమ పాత్రలో కనిపించారు.

వీర భోగ వసంత రాయలు (శ్రీవిష్ణు) ఫ్లైట్ ను హైజాగ్ చేయడం, ఇల్లు మిస్ కావడం.. అంశాలు మరింత సస్పెన్స్ ని క్రియేట్ చేశారు. ఈ క్రమంలో వచ్చిన ఓ ట్విస్టుతో ఇంటర్వెల్ కార్డు పడిపోయింది. అది సెకాంఢాప్ పై మరింత ఆసక్తిని పెంచింది. ఇక, రెండో భాగంలో శ్రీవిష్ణు గతానికి సంబంధించిన విషయాలు, తప్పిపోయిన ఇల్లు కనుక్కోవడం, హైజాగ్ అయిన ఫైట్ ని కనిపెట్టడం వంటి అంశాలని ఒక్కోక్కటిగా రిలీవ్ చేస్తూ సినిమాని ముగించాడు. ఈ క్రమంలో వచ్చే ఒకట్రెండు ట్విస్టులో ప్రేక్షకుడిని థ్రిల్ కి గురిచేస్తాయి. సినిమాలో శ్రీవిష్ణు పాత్ర, అందులో ఆయన నటన హైలైట్ గా నిలిచింది.