అరవింద.. అస్సలు ఆపడం లేదు !
త్రివిక్రమ్ సినిమాలకు అస్సలు ప్రమోషన్ నే అవసరం లేదు. ఆయన సినిమా ప్రారంభోత్సవం జరుపుకొన్న రోజు నుంచే అంచనాలు పెరిగిపోతాయి. ఈసారి త్రివిక్రమ్ తారక్ తో జతకట్టాడు. ఇక, ప్రమోషన్స్ తో పనిలేదు అనుకొన్నారంత. కానీ, ఎప్పుడూ లేని విధంగా త్రివిక్రమ్ ఈ సారి ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టాడు. ‘అరవింద సమేత’ విడుదలకు ముందు తర్వాత కూడా సినిమాకు సంబంధించిన విశేషాలని స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. బహుశా.. ‘అజ్ఝాతవాసి’ ఎఫెక్ట్ తో త్రివిక్రమ్ లో వచ్చిన మార్పు కావొచ్చు. ఇప్పటికే ‘అరవింద సమేత’ బ్లాక్ బస్టర్ హిట్ గా తేలిపోయింది. నాన్ బాహుబలి రికార్డులన్నీ కొల్లగొడుతోంది.
అయినా చిత్రబృందం ప్రమోషన్స్ కార్యక్రమాలని మాత్రం ఆపడం లేదు. ఇవాళ సాయంత్రం ‘రెడ్డమ్మతల్లి.. ‘ వీడియో ప్రొమో సాంగ్ ని విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు హారిక అండ్ హాసిని బ్యానర్ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెట్టారు. ఇలాంటి ప్రమోషన్స్ తో సినిమా కలెక్షన్స్ మరింతగా పెరగుతాయన్నది చిత్రబృంద ప్లాన్. ఇక, ఇప్పటికే వీరరాఘవుడు రూ. 150కోట్ల కలెక్షన్స్ ని క్రాస్ చేశాడు. ఓవర్సీస్ లోనూ 2మిలియన్ మార్క్ ని క్రాస్ చేశాడు. లాంగ్ రన్ లో నాన్ బాహుబలి రికార్డులన్నీ బద్దలు కొట్టడమే లక్ష్యంగా దూసుకెళ్తున్నాడు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ నటించిన తొలి చిత్రమిది. రాయలసీమ ఫ్యాక్షన్ కొత్త కోణంలో చూపించి ప్రశంసలు అందుకొన్నాడు త్రివిక్రమ్. ఎన్ టీఆర్ నటన, త్రివిక్రమ్ గ్రిప్పింగ్ స్కీన్ ప్లే, థమన్ నేపథ్య సంగీతం సినిమాలో హైలైట్ గా నిలిచాయి.
Video promo of #ReddammaThalli, Sung by #MohanaBhogaraju & lyric by #PenchalDas garu will release today at 04:05pm. Stay tuned!@tarak9999 #Trivikram @musicthaman @hegdepooja @vamsi84 pic.twitter.com/Vj2mui2Emu
— Haarika & Hassine Creations (@haarikahassine) October 24, 2018