‘హలో గురూ.. సక్సెస్ టూర్’ షెడ్యూల్ !

ఎనర్జిట్ హీరో రామ్ ప్రేమ కోసం చేసిన ప్రయత్నం ఫలించింది. ఆయన హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘హలో గురూ ప్రేమకోసమే’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. దసరా పండగ (అక్టోబర్ 18) రోజున విడుదలైన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ కలెక్షన్స్ లో అదరగొడుతోంది. ఐదు రోజుల్లోనే రూ.14.70కోట్ల షేర్ ని రాబట్టింది. నైజాం, సీడెడ్ లో రెస్పాన్స్ ఇంకా బాగుంది. ఈ ఆనందంలో ఉన్న చిత్రబృందం సక్సెస్ టూర్ ని ప్లాన్ చేసింది.

దీనికి సంబంధించిన షెడ్యూల్ ని రామ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. రేపటి (అక్టోబర్ 25) నుంచి సెక్సెస్ టూర్ ప్రారంభం కానుంది. ఆ రోజు గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి నగరాల్లోని థియేటర్స్ లో చిత్రబృందం సందడి చేయనుంది. అక్టోబర్ 26న కాకినాడ, పాయకరావు పేట, అనకాపల్లి, గాజువాక నగరాల్లోని థియేటర్స్ లో, అక్టోబర్ 27న వైజాగ్ లో చిత్రబృందం సందడి చేయనుంది. దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన చిత్రాలకు ఇలాంటి సక్సెస్ టూర్ సాధారణమే.

ఐతే, హలో గురూ చిత్రబృందం మొత్తం.. ఈ సక్సెస్ టూర్ లో పాల్గొంటుందా.. ? లేదంటే.. హీరో-హీరోయిన్స్, దర్శకుడు, నిర్మాతలతో కానిచ్చేస్తారా.. ? అన్నది తెలియాల్సి ఉంది.