విశాఖ వన్డే టై
నరాలు తెగ ఉత్కంఠభరితంగా సాగిన విశాఖ వన్డే టైగా ముగిసింది. కోహ్లీ సేన విధించిన 322 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు విండీస్ ఆఖరి బంతి వరకు పోరాడింది. ఒక్కపరుగుతో విజయాన్ని దూరం చేసుకొంది.
ఓ దశలో విండీస్ సునాయసంగా గెలిచేలా కనబడింది. ఐతే, ఆఖరి 10ఓవర్లు భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో.. ఆఖరి ఓవర్లో విండీస్ కు 14 పరుగులు అవసరం అయ్యాయి. ఉమేష్ యాదవ్ బౌలర్. ఆఖరి బంతికి 5 పరుగులు అవసరం.. షై హోప్ ఫోర్ కొట్టడంతో మ్యాచ్ టైగా ముగిసింది. షై హోప్ (123; 134 బంతుల్లో 10×4, 3×6) అజేయంగా నిలిచాడు.
అంతకుముందు కోహ్లీ 157 నాటౌట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆయనకు తోడుగా అంబటి రాయుడు 73 పరుగులతో రాణించాడు. ఫలితంగా టీమిండియా నిర్ణీత 50ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేయగలిగింది.