రివ్యూ : వీరభోగ వసంతరాయలు
చిత్రం : వీర భోగ వసంత రాయలు
నటీనటులు : సుధీర్ బాబు, నారా రోహిత్, శ్రీ విష్ణు, శ్రియ
సంగీతం : మార్క్ కె రాబిన్
దర్శకత్వం : ఆర్ ఇంద్రసేన
నిర్మాత : అప్పారావు
రేటింగ్ : 2/5
టాలీవుడ్ లో విభిన్నమైన సినిమాలతో అదరగొడుతున్న యంగ్ హీరోలు నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీవిష్ణు.. ఈ ముగ్గురిని ఓ కథ పడేసింది. అంటే ఆ కథపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్దాయి. ‘వీరభోగ వసంతరాయలు’ టైటిల్ తో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ టీజర్, ట్రైలర్స్ ఆకట్టుకొన్నాయి. సినిమాలో ఏదో మేజిక్ ఉంది. అదేంటో చూద్దామని ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూడసాగారు. ఇంతలో ఓ రెండ్రోజుల ముందే ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో విడుదల చేశారు. అక్కడ వచ్చిన ప్లాప్ టాక్ సినిమా ఇమేజ్ ని డ్యామేజ్ చేసింది. ఆ డ్యామేజ్ తోనే ‘వీరభోగ వంతరాయలు’ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. తెలుగు ప్రేక్షకులని ఈ మల్టీస్టారర్ ఏ మేరకు ఆకట్టుకొంది ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
క్రికెటర్స్ తో పాటు ప్రముఖులు ప్రయాణిస్తున్న విమానం హైజాక్. అందులో మొత్తం 300మంది ప్రయాణికులు. ఈ 300 మంది బందీలని విడుదల చేయాలంటే.. అదే సంఖ్యలో నేరస్తులని చంపేయాలని డిమాండ్. మరోవైపు, నగరంలో వరుసగా అనాథ పిల్లల కిడ్నాప్‌లు. అదే సమయంలో ఓ కుర్రాడి ఇళ్లు తప్పిపోవడం.
ఈ మూడు కేసుల్లో విమాన హైజాక్ కేసును దీపక్ (నారా రోహిత్), నీలిమా (శ్రియ)లకు టేకప్ చేస్తుంటారు. తప్పిపోయిన ఇంటిని కేసును వినయ్ (సుధీర్ బాబు) టేకప్ చేస్తాడు. ఇంతకీ ఈ మూడు కేసుల వెనక ఉన్నది ఎవరు ? ఇందులో ఒకదానితో మరొకదానికి సంబంధం ఏమిటీ ? సినిమాలో వీరభోగ వసంతరాయలు ఎవరు ? అనేది మిగతా కథ.
నటీనటుల ఫర్ ఫామెన్స్ :
దర్శకుడు ఇంద్రసేన అనుకొన్న పాయింట్ బాగుంది. మూడు విభిన్నమైన కేసులు. వాటిని గ్రిప్పింగ్ స్కీన్ ప్లే, ట్విస్టులతో ప్రేక్షకుడికి నారాలు తెగే ఉత్కంఠని కలిగించే స్కోప్ ఉంది. ఐతే, తెరపై దాన్ని పక్కగా అమలు చేయడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. ఫలితంగా ఢిఫరెంట్ కాన్సెప్ట్ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. ఐతే, ప్రారంభ, క్లైమాక్స్ సన్నివేశాలు ఆకట్టుకొనేలా ఉన్నాయి. ఇన్నాళ్లు పక్కంటి అబ్బాయిలా కనిపించిన శ్రీవిష్ణు ఇందులో విలన్ రోల్ లో కనిపించాడు.
ప్రయోగాలు చేసేందుకు ఇష్టపడే హీరోలు నారా లోకేష్, సుధీర్ బాబు, శ్రీవిష్ణుల నటన బాగుంది. ఇందులో శ్రీవిష్ణు పాత్ర హైలైట్ గా నిలిచింది. ఆయన లుక్, నటన బాగుంది. శ్రీవిష్ణు తర్వాత తెరపై ఎక్కువగా కనిపించింది సుధీర్ బాబు. ఆయన నటన ఓకే. ఐతే, ఆయన పాత్రకి డబ్బింగ్ సరిగ్గా కుదరలేదు. అది లోటుగా అనిపించింది. నారా రోహిత్, శ్రియలు నటనతో ఆకట్టుకొన్నారు. ఇతర పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. ఉన్నంతలో మిగితా పాత్రధారులు నటించేశారు. మిగితా నటీనటులు ఫర్వాలేదనిపించారు.
సాంకేతికంగా :
కథ-కథనం నీరసంగా ఉండటంతో టెక్నికల్ గా సినిమా డల్ గా అనిపించింది. నిర్మాణ విలువలు మరీ దారుణంగా ఉన్నాయి. ఇలాంటి కథని చాలా రిచ్ గా, పకడ్భందీగా తీయాల్సి ఉంటుంది. సాదాసీగా తీసేసి.. ఇదో గొప్ప సినిమా అనుకొన్నారు. సంగీతం, నేపథ్యం సంగీతం సోసోగానే ఉన్నాయి. కొన్ని సీన్స్ ని కత్తిరించొచ్చు. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. మొత్తంగా.. టెక్నికల్ గా వీరభోగ వసంతరాయలు పూర్ గా కనిపించాడు.
చివరగా : ‘వీరభోగ వసంతరాయలు’.. వీరత్వం, వైభోగాలు ఏమీ లేవు.
రేటింగ్ : 2 /5