జగన్’పై శ్రీరెడ్డి ప్రేమ.. షాక్ కొట్టింది !

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటన.. ఇప్పుడు దేశ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్. విశాఖలో విమానాశ్రయంలో జగన్ పై దాడి జరిగినా.. ఆయన హాయిగా హైదరాబాద్ వచ్చేసి.. ఇక్కడ అపోలా ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్సపొందుతున్నారు. ఆయన ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్స్. మీడియా మొత్తం ఆయనపై ఫోకస్ పెట్టింది. ఓ దినపత్రిక ఏకంగా జగన్ హెల్త్ బులిటెన్స్ లైవ్ అప్ డేట్స్ ఇస్తోంది. కేంద్రం కూడా ఈ దాడిపై గవర్నర్ పిలిపించుకొని నివేదిక తీసుకొంది.

మరోవైపు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జగన్ ని పలువురు నేతలు పరామర్శిస్తున్నారు. కుదరని కొందరు సోషల్ మీడియా వేదికగా జగన్ పై దాడిని ఖండించడం లేదంటే సానూభూతిని తెలపడం చేస్తున్నారు. వివాదాస్పద టాలీవుడ్ నటి శ్రీరెడ్ది కూడా అదే చేసింది. ‘మా జగన్ అన్నకు ఏం అయింది. రాష్ట్రం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నారు. అలాంటి వ్యక్తి మీద ప్రతిపక్షాలు దాడులు చేయడం ఏంటి ? దమ్ముంటే జగన్ ను ధైర్యంగా ఎదుర్కొనాలి. అంతేగానీ జనం కోసం పోరాడుతున్న జగన్’పై ఇలాంటి దాడులు చేయడం తప్పు. జగనన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్ చేసింది శ్రీరెడ్డి.

జగన్ అన్న అంటూ ప్రేమని కురిపించిన శ్రీరెడ్డికి షాక్ కొట్టింది. ఆమె స్పందనపై నెటిజర్స్ మండిపడుతున్నారు. చెప్పడానికి, రాయడానికి కూడా రాని కామెంట్స్ ఎదురుదాడికి దిగుతున్నారు. వారు టీడీపీకి చెందినవారా.. ? వైసీపీకి చెందినవారా.. ?? అన్న విషయం ప్రక్కన పెడితే.. శ్రీరెడ్డి ప్రేమ, సానుభూమి జగన్ కు అవసరం లేదు అన్నట్టుగా కామెంట్స్ చేస్తున్నారు. పాపం.. శ్రీరెడ్డి ప్రేమగా స్పందించిన ఈ ఎటాక్ ఏంటీ బాబు.. ? అంటూ పలువురు శ్రీరెడ్డిపై సానుభూతి చూపించే పరిస్థితి నెలకొంది.. మరీ.. !