రామ్ హీరోయిన్స్’ని వాడుకొంటున్నాడు !

ఎనర్జిట్ హీరో రామ్ హీరోయిన్స్ ని బాగా వాడుకొంటున్నాడు. ఏకంగా ఇద్దరు హీరోయిన్స్ తన వెంట తిప్పికొంటున్నారు. అలాగని తప్పుగా అనుకోకండి. ఆ ఇద్దరు ఆయన హీరోయిన్స్ నే. రామ్ తాజా చిత్రం ‘హలో గురూ ప్రేమకోసమే’. త్రినాథరావు నక్కిన దర్శకుడు. ఇందులో రామ్ సరసన అనుపమపరమేశ్వరన్, ప్రణీత జతకట్టారు. దసరా పండగ రోజున ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ రొమాటిక్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకొంది. తొలివారం కలెక్షన్స్ బాగున్నాయి.

అవి మరింతగా పెరిగేందుకు చిత్రబృందం సక్సెస్ టూర్ ని ప్లాన్ చేసింది. మూడు రోజుల (అక్టోబర్ 25, 26, 27) ఏపీలో చక్కర్లు కొడుతోంది. ఇందులో భాగంగా రామ్ తో పాటుగా ఆయన హీరోయిన్స్ అనుపమ, ప్రణీత పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఈ ఇద్దరు ముద్దుగుమ్మలతో రామ్ తీసుకొన్న సెల్ఫీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చూసిన ఆయన అభిమానులు రామ్ హీరోయిన్స్ ని బాగా వాడుకొంటున్నారని కామెంట్స్ చేస్తున్నారు. మరీ.. ఆ వాడకం ఏ మేరకు ఫలితానిస్తోంది. సినిమా కలెక్షన్స్ పెరుగుతాయా ? అన్నది చూడాలి. మరో వారం పాటు కలెక్షన్స్ తగ్గకుంటే మంచి లాభాలు వచ్చినట్టే.