మహేష్ హీరోయిన్ సంతోషం చూశారా.. ?


టాలీవుడ్ లో హీరోయిన్ పూజా హెగ్డే హవా చూపిస్తోంది. వరుసగా స్టార్ హీరోలతో జతకడుతోంది. ఇప్పటికే అల్లు అర్జున్, ఎన్టీఆర్ లతో ఓ రౌండ్ అయిపోయింది. ప్రస్తుతం మహేష్ ‘మహర్షి’, రాథాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రభాస్ ప్రేమకథా చిత్రం సెట్స్ మీదున్నాయి. ఈ రెండు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ లిస్టులో చేరిపోతే పూజా రేంజ్ నే పెరిగిపోద్ది. మరోవైపు, బాలీవుడ్ లో ‘హౌస్ ఫుల్ -4’లో కీలక పాత్రలో నటిస్తోంది. వివాదాల్లో ఇరుక్కొని మళ్లీ షూటింగ్ మొదలైన ఈ సినిమా వచ్చే యేడాది అక్టోబర్ లో రానుంది.

ప్రస్తుతానికైతే పూజా మహేష్ ‘మహర్షి’ షూటింగ్ లో ఉంది. అక్కడ ఫుల్ హ్యాపీ. ఈ సినిమాతో నాలోని నెగటివ్ ఆలోచనలన్నీ పోయాయ్. సంతోషం నింపింది. ఎలా బతకాల్లో నేర్పిందని ట్విట్ చేసింది. ఈ హ్యాపీ మూడ్ లో సెట్స్ లో దిగిన ఫోటోలని తన ఇన్ స్ట్రోగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇది చూసిన జనాలు మహేశ్ హీరోయిన్ హ్యాపీ నెస్ చూశారా ? అని చెప్పుకొంటున్నారు. వరుసగా స్టార్ హీరోలతో రొమాన్స్ అంటే.. హ్యాపీ నెస్ కాకుంటే.. ఇంకేముంటుంది.