టీ-కాంగ్రెస్ నేతల భయంపై ఎన్నికల కమిషన్ రియాక్ట్ !
తెలంగాణ కాంగ్రెస్ నేతల భయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజెస్ పార్టీలు మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనికి ప్రజాకూటమి అనే పేరు కూడా అనుకొంటున్నరు. ప్రస్తుతం ఈ కూటమి సీట్ల పంపకాల చర్చల్లో బిజీగా ఉంది. ఆ తర్వాత ప్రచారాన్ని హోరెత్తించనుంది. అంతకంటే ముందు తెలంగాణ ప్రభుత్వం మహాకూటమి నేతల ఫోన్ టాపరింగ్ కు పాల్పడుతున్నారనే భయం పట్టుకొంది.
దీనికితోడు ఈ నేతల వాహనాలకు పోలీసుల తనిఖీల పేరిట వేధింపులు కూడా ఎక్కువయ్యాట. దీనిపై గురువారం మహాకూటమి నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తాజాగా, దీనిపై ఎన్నికల సంఘం స్పందించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని నివేదిక కోరారు. ఎవరివైనా ఫోన్లు ట్యాపింగ్ జరుగుతోందా ? చేస్తే ఎవరెవరివి ట్యాప్ చేస్తున్నారో వివరాలు ఇవ్వాలని కోరారు.
దీంతోపాటు ఎంఎంటీఎస్ రైళ్లలో సీఎం కేసీఆర్ ఫొటోలతో కూడిన ప్రకటనలు పెట్టారనే ఫిర్యాదుపైనా ఆయన స్పందించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎం నుంచి ఆయన నివేదిక కోరారు. ప్రగతిభవన్‌లో రాజకీయ కార్యక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుపైనా ఈసీ వివరణ కోరే అవకాశం ఉన్నట్లు సమాచారమ్. మొత్తానికి మహాకూటమి నేతలపై బాధపై ఎన్నికల కమిషన్ స్పందించడం.. వారికి కాస్త ఊరట కలిగించే అంశమని చెప్పవచ్చు.