కాంగ్రెస్ గెలుపుకు ప్లాన్ చేసిన టీఆర్ఎస్ నేత !

తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం టీఆర్ఎస్ సీనియర్ నేత ప్రయత్నాలు చేస్తున్నారు. స్వయంగా కొంతమంది టీఆర్ఎస్ నేతలని ఢిల్లీకి తీసుకెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం ఇప్పించారు. ఆయన కూడా కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారని ప్రచారం జరుగుతోంది. ఆ టీఆర్ఎస్ సీనియర్ నేత ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. డీ. శ్రీనివాస్. ఆయన నైతికంగా ఇంకా టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు డీఎస్ పై ఆరోపణలున్నాయి.

ఈ నేపథ్యంలో ఆయనపై కేసీఆర్ వేటు వేయబోతున్నట్టు ప్రచారం జరిగింది. బీసీ నేత, అందులోనూ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన డీఎస్ పై వేటు వేస్తే పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని ఊహించని కేసీఆర్.. డీఎస్ ని పొమ్మనక పొగబెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. రాజకీయాల్లో తలపండిన డీఎస్ కూడా తొందరపడకుండా కాంగ్రెస్ లోనే ఉంటూ కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఢిల్లీ వెళ్లి రాహుల్ ని కలిశారు. తన తరుపున ఇద్దరు టీఆర్ఎస్ నేతలని టి.నర్సారెడ్డి, ఎమ్మెల్సీ రాములు నాయక్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేర్పించారు. ఆయన కూడా తిరిగి కాంగ్రెస్ లో చేరడం ఖాయం

అదెప్పుడు ? అనేది తెలియాల్సి ఉంది. ఇక, తాజాగా, ఢిలీ వెళ్లడం.. రాహుల్ ని కవలడంపై డీఎస్ స్పందించారు. తాను కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలవడానికి సమయం అడిగాను.. రాహుల్‌ తనకు సమయం ఇచ్చారు. ఆయనని కలిశాను కూడా. ఐతే, రాహుల్‌తో ఏం మాట్లాడానో మీతో చెప్పాల్సిన పనిలేదని అన్నారు డీఎస్. బహుశా.. ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి డీఎస్ కు తగిన హామీ రానట్టుంది.