యాంకర్ రవిపై పోలీస్ కేసు.. వెనక అసలు నిజాలు !
యాంకర్ రవిపై పోలీస్ కేసు నమోదైంది. దీంతో ఆయన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో హాజరయ్యారు. కొద్దిసేపు ఆయన్ని విచారించిన పోలీసులు ఆ తర్వాత వదిలిపెట్టారు. పిలిచినప్పుడు కచ్చితంగా మళ్లీ స్టేషన్ కు రావాల్సి ఉంటుందనే షరతుపై రవిని విడిచిపెట్టినట్టు తెలుస్తోంది.
వివరాల్లోకి వెఌతే.. సందీప్ అనే వ్యక్తి రవి నుంచి రూ. 15లక్షలు అప్పుగా తీసుకొన్నాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో అతడిని రవి బెదిరిస్తున్నాడట. కొద్దిమందిని తీసుకొచ్చి మరీ దమ్ కీ ఇచ్చాడట. ఈ మేరకు సందీప్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రవిని పిలిపించి మాట్లాడినట్టు తెలిసింది. ఈ కేసు విషయంలో అవసరమైతే మళ్లీ పిలుస్తామని రావాల్సి ఉంటుందని రవికి పోలీసులు చెప్పినట్టు తెలుస్తోంది.