‘సవ్యసాచి’ సెన్సార్ రివ్యూ
నాగ చైతన్యని ‘సవ్యసాచి’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య-నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రమిది. మాధవన్, భూమిక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని దీపావళీ కానుకగా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా, ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకొంది. ‘యు/ఎ’ సర్టిఫికెట్ ని పొందింది.
సినిమా చాలా వైవిధంగా సాగింది. చందూ మొండేటి స్క్రీన్ ప్లే, నాగ చైతన్య, మాధవన్ ల నటన సినిమాకే హైలైట్ గా నిలిచాయని సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చెప్పినట్టు సమాచారమ్. ఇన్నాళ్లు ఎక్కువగా ప్రేమకథలతో మెప్పించిన చైతూకి ఇదో విభిన్నమైన సినిమాగా నిలవనుందని చెబుతున్నారు.
ఇందులో భూమిక చైతూ అక్కగా కనిపించనున్నారని తెలిసింది. ఆమె పై పగ తీర్చుకొనే పాత్రలో మాధవన్ కనిపిస్తాడు. ఆయన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. దీన్ని బట్టి చైతూ, భూమికలు ఒకే శరారాన్ని పంచుకొని పుట్టినట్టు తెలుస్తోంది. అందుకే ‘మాములుగా ఒక తల్లి రక్తం పంచుకుని పుడితే అన్నదమ్ములంటారు. అదే ఒకే రక్తం .. ఒకే శరీరం పంచుకుని పుడితే దాన్ని అద్భుతం అంటారు. అలాంటి అద్భుతానికి మొదలుని వరుసకి కనిపించని అన్నని, కడదాకా వుండే కవచాన్ని .. ఈ సవ్యసాచిలో సగాన్ని’ డైలాగ్ టీజర్ లో వినబడిందని చెబుతున్నారు.