‘అమర్ అక్భర్ ఆంథోని’ టీజర్ టాక్

శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ ‘అమర్ అక్భర్ ఆంథోని’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఇలియానా టాలీవుడ్ కు రీ-ఎంట్రీ ఇవ్వనుంది. సునీల్ కమెడియన్ గా రీ-ఎంట్రీ ఇచ్చి నటిస్తున్న చిత్రాల్లో ఇదొక్కటి. ల‌య‌, వెన్నెల కిషోర్, ర‌ఘుబాబు, త‌రుణ్ అరోరా, అభిమ‌న్యు సింగ్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోంది.

ఈ సినిమాను డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా, ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

* ముగింపు రాసుకొన్న తర్వాతే కథ మొదలుపెట్టాలి అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది.

* చిన్ననాటి జ్ఝాపకాలని తలచుకొంటూ ఉలిక్కపడుతున్న రవితేజ కనిపించాడు.

* మనకు నిజమైన ఆపద వచ్చినప్పుడు మనన్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు. మనలో ఉన్న బలం.

* వాడు ఎక్కడ ఉంటాడో.. ఎలా ఉంటాడో.. ఎక్కడుంటాడో ఎవ్వరికీ తెలీదు. అనే డైలాగ్స్ బాగా పేలాయి.

* చివరల్లో రవితేజ తనదైన స్టయిల్ లో రిలాక్స్ అంటూ ఆకట్టుకొన్నాడు.

టీజర్ లో మహేష్ ‘వన్ నేనొక్కడినే’, రవితేజ ‘కిక్’ తాలుకూ ఛాయలు కనిపించాయి. మూడు విభిన్న గెటప్ లో మాస్ మహారాజా అలరించబోతున్నట్టు టీజర్ ని చూస్తే అర్థమవుతోంది. ఇక, టాలీవుడ్ కి రీ-ఎంట్రీ ఇస్తున్న ఇలియానా అందంగా కనిపించింది. టీజర్ లో ఆమెని రొమాన్స్ లోకి దించలేదు. మొత్తంగా.. టీజర్ కిక్కునిచ్చేలా ఉంది.