రకుల్ జాకెట్’ని ఇంత ఘోరంగా చింపేసిందెవరు.. !?
అసలే #మీటూ ఉద్యమం ఉప్పెనలా ఉప్పొంగుతున్న సమయం. ఈ సమయంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చిరిగిపోయిన జాకెట్ ని తన ఇస్టోగ్రామ్ లో పోస్ట్ చేసింది. దీంతో రకుల్ పై ఈ దారుణానికి పాల్పడింది ఎవరు ? డౌటు కలిగింది. ఇంకాస్త స్పష్టంగా ఆ జాకెట్ ని చూస్తే పక్కనున్న కామెంట్ కనబడింది. ‘మనలో ఉన్న చిన్నపిల్లల మనస్తతత్వాన్ని ఎప్పటికీ అలాగే ఉండనివ్వాలంటూ’ రకుల్ కామెంట్ పెట్టింది. దీంతో రకుల్’పై దారుణం ఏమీ జరగలేదు. ఆమె చేసిన చిలిపి పోస్ట్ ఇదని అర్థమైంది.
అప్పటికే ఈ పిక్ పై ‘నీ జాకెట్ను ఇంత ఘోరంగా చింపేసింది ఎవరు’ అంటూ హీరోయిన్ తాప్సీ కామెంట్ చేసింది. దీనికి ‘నాలో ఉన్న చిన్నపిల్ల’ అంటూ చిలిపిగా రకుల్ రిప్లై ఇచ్చింది. రకుల్ ఇలా చిరిగిపోయిన జాకెట్ ఉండటం ఆమె అభిమానులకి మాత్రం నచ్చలేదు. ఆమెను ఓ రౌండ్ వేసుకొన్నారు. బిచ్చగాళ్లే నయం ఇంతకంటే మంచి డ్రెస్సులు వేసుకుంటారు. నీ దగ్గర డ్రెస్లు లేకుంటే నాకు చెప్పు నేను ఇస్తానుగా. చిరిగిన డ్రెస్లు వేసుకుంటే ఒకప్పుడు పిచ్చొళ్లని అనేవారని, కానీ ఇప్పుడు వాటినే బ్రాండ్ అంటున్నారు. ఇలా ఇలా రకాలుగా రకుల్ పై కామెంట్స్ చేస్తున్నారు.
ఇక, సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తెలుగులో రకుల్ చేతిలో ఒక్క ఎన్ టీఆర్ బయోపిక్ మాత్రమే ఉంది. ఇందులో ఆమె అతిలోక సుందరి శ్రీదేవి పాత్రలో కనిపించనున్నారు. దాదాపు 20 నిమిషాల పాత్ర కోసం ఆమె ఏకంగా రూ. కోటి పారితోషికం తీసుకుంటుందట. కోలీవుడ్ లో రకుల్ హవా బాగానే ఉంది. బాలీవుడ్ లోనూ రకుల్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
Sheepish me when I’m caught being the goofy me
#keepthechildinyoualive alwaysssss
https://t.co/ZF3YLNSZpV
— Rakul Preet (@Rakulpreet) October 29, 2018