ఈసారి గట్టిగా కొట్టారు


టెస్టులో పెద్దగా పోటీ ఇవ్వకపోయినా.. వన్డేలో మాత్రం వెస్టిండీస్ జట్టు గట్టిగా పోరాడుతోంది. తొలి వన్డేలో ఓడినా.. రెండో వన్డేలో గెలిచినంత పని చేశారు. ఆఖరికి టైగా ముగించేశారు. మూడో వన్డేలో ఏకంగా గెలిచేశారు. ఇక, నాల్గో వన్డేలో విండీస్ కి ఆ ఛాన్స్ ఇవ్వలేదు టీమిండియా. మొదటి బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 377పరుగుల భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ 162, అంబటి రాయుడు 100 పరుగులతో చెలరేగిపోయారు.

అనంతరం 378 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ భారత బౌలింగ్‌, ఫీల్డింగ్ ధాటికి విలవిల్లాడింది. 6 ఓవర్లకు 20/3తో నిలిచింది. 10 ఓవర్లకు 47/5తో, 19 ఓవర్లకు 77/7తో కుదేలైంది. 153 పరుగులకే ఆలౌటైంది. దీంతో కోహ్లీసేన 224 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 2-1తో సిరీస్‌లో ఆధిక్యం సాధించింది. ఇక, ఆఖరి, 5వ వన్ డే నవంబర్ 1న జరగనుంది.