అమర్ అక్భర్ అంథోనీ : ‘కలలా కథలా..’ లిరికల్ వీడియో !

శ్రీను వైట్ల – రవితేజ లది హిట్ కాంబో. వీరి కలయికలో వచ్చిన వెంకీ, దుబాయ్ శీను సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో వరుస ప్లాపుల్లో ఉన్న శ్రీను వైట్ల మరోసారి మాస్ మహారాజాతో జతకట్టాడు. ఆయనతో ఓ డిఫరెంట్ కాన్సెప్టుతో ‘అమర్ అక్భర్ ఆంథోని’ తెరకెక్కిస్తున్నారు. కాన్సెప్టు పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెరిగేలా చేశారు. ఇక, టీజర్ తో సినిమాపై మరింత నమ్మకం కలిగింది. ఇప్పుడీ సినిమా ప్రమోషన్స్ లోనూ వేగం పెంచారు.

ఇందులో భాగంగా సినిమా ‘కళలా కథలా..’ లిరికల్ వీడియోని విడుదల చేసింది చిత్రబృందం. రామజోగయ్య శాస్త్రీ రాసిన ఈ పాటని హరిని ఇవ్వతూరి పాడారు. థమన్ సంగీతం సమకూర్చారు. హీరోయిన్ ఇలియానా హీరో రవితేజతో చిన్ననాటి జ్ఝాపకాలని గుర్తుచేసుకొంటూ ఈ సాంగ్ సాగింది. వినడానికి కమ్మగా ఉన్న ఈ సాంగ్ ని మీరు ఓ సారి చూసేయండీ.. !


ఈ చిత్రం ద్వారా ఇలియానా టాలీవుడ్ కి రీ-ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక రవితేజ మూడు విభిన్నమైన గెటప్స్ లో కనిపించబోతున్నారు. దాని తాలుకూ టీజర్ లోనే హింట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ సినిమాని డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.