ఎన్నికల ఎఫెక్ట్ : బిర్యానీ రేట్ల తగ్గింపు.. !!

దేశంలో ఎన్నికల హీట్ మొదలైంది. తెలంగాణలో అది ఇంకాస్త ముందుగానే వచ్చేసింది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేసే పనిలో ఉన్నాయి. ఐతే, ఎన్నికల పుణ్యమా అని తెలంగాణలో బిర్యానీ రేట్లు తగ్గనున్నాయి. ఏకంగా ఎన్నికల సంఘమే బిర్యానీ రేట్లని తగ్గించాలని కోరుతుంది. అది కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నవారి కోసం పర్సీల్స్ తీసుకొనే వారికి మాత్రమేనట. ఎన్నికల ఖర్చుని తగ్గించడంలో భాగంగా ఈ సూచన చేసిందట.

ఎన్నికల సంఘం సూచనని చూసి జనాలు కూడా తవ్వుకొంటున్నారు. దీనిపై సటైర్స్ వేస్తున్నారు. బిర్యానీ రేట్లతో పాటు మధ్యం రేట్లు కూడా తగ్గించమని ఎన్నికల సంఘం కోరుతే బాగుండు. ఎన్నికల ఖర్చు ఇంకా తగ్గును అని చెప్పుకొంటున్నారు. కాకుంటే ఏంది మల్ల. ఎన్నికల సమయంలో నేతలు పంచి పెట్టే డబ్బు ముందు.. గీ బిర్యానీ ప్యాకెట్ల ఖ్చరు ఓ లెక్కన్నా.. ? అరె.. గిన్నాళ్లు సామాన్య జనాలు నీరు, తినడానికి తిండిలేకపోతే ఎవ్వరు స్పందించరు. కానీ.. నేతల ఎన్నికల ఖర్ఛు అనగానే.. ఎన్నికల సంఘం కూడా రేట్లు తగ్గించమనడం ఏంది.. ? గిది పొలిటికల్ సిఫార్సు కాకపోతే.. !