ఇలియానా నాలుగు రోజుల పాటు అదే పనిలో.. !

గోవా బ్యూటీ ఇలియానా మళ్లీ తెలుగు ప్రేక్షకులని పలరించబోతుంది. తనకి బాగా ఇష్టమైన మాస్ మహారాజా రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రం ద్వారా టాలీవుడ్ కి రీ-ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే ఇల్లీ తెలుగులో 16 సినిమాల్లో నటించింది. ఇక్కడ స్టార్ హీరోయిన్ అనిపించుకొంది. తెలుగులో తొలి కోటి అందుకొన్న హీరోయిన్ గా ఇల్లీకి రికార్డు ఉంది. ఇక్కడ మాంఛి ఫామ్ లో ఉండగానే బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ పర్వాలేదనిపించినా.. బిజీ హీరోయిన్ అనిపించుకోలేకపోయింది. ఈ మధ్య ఆమెకు బాలీవుడ్ లో అవకాశాలే లేకుండా పోయాయి. దీంతో ఆమె మళ్లీ టాలీవుడ్ వైపు చూసింది.
మహేష్ లాంటి స్టార్ హీరో సినిమాతో రీ-ఎంట్రీ ఇద్దామని ప్రయత్నించింది కూడా. మహేష్ 25వ చిత్రం ‘మహర్షి’ కోసం ముందుగా ఇల్లీ పేరే వినిపించింది. ఐతే, అందులో నిజం లేదని చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. మహేష్ కోసం పూజా హెగ్డేని తీసుకొన్నామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇల్లీ టాలీవుడ్ రీ-ఎంట్రీ ఇప్పట్లో లేనట్టేననే ప్రచారం జరిగింది. ఇంతలో మాస్ మహారాజా ఇల్లీపై మనసుపడ్డాడు. ‘అమర్ అక్బర్ ఆంటోని’ కోసం ఇల్లీని తీసుకొన్నాడు. ఇప్పుడీ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది.
ఈ నెల 16న ‘అమర్ అక్బర్ ఆంటోని’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన పనులన్నీ ఇల్లీ ముగించుకొందట. ఇటీవలే డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేసిందట. ఆమె సొంతంగా డబ్బింగ్ చెప్పింది. అది కూడా కేవలం నాలుగు రోజుల్లోనే పూర్తి చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర నిర్మాతలు.. ఇల్లీ నాలుగు రోజుల పాటు డబ్బింగ్ చెప్పే పనిలో మునిగిపోయింది. ఆమె వాయిస్ బాగుందంటూ కితాబిస్తున్నారు. మళ్లీ ఇల్లీ రీ-ఎంట్రీ చిత్రం ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.