కేసీఆర్ గెలుపుకోసం గద్దర్.. !?

గజ్వేల్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ని గెలిపించేందుకు ప్రజా యుద్దనౌక గద్దర్ రంగంలోకి దిగాడని చెప్పుకొంటున్నారు. అదీ.. నిజమే. ఎందుకంటే ? ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు స్థానాల్లో పోటీ చేయబోతున్నారు. గజ్వెల్ తో పాటు మెడ్చల్ స్థానం నుంచి కేసీఆర్ బరిలోకి దిగబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. గజ్వెల్ లో కేసీఆర్ ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్ది పేరు వినబడుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఒంటేరు కేసీఆర్ కి గట్టిపోటీ ఇవ్వగలిగారు. ఈ సారి ఆయన నుంచి కేసీఆర్ నెక్ టు నెక్ పోటీ తప్పదు. ఒంటేరు గెలుపొందిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని స్థానికంగా చెప్పుకొంటున్నారు.

ఇలాంటి నేపథ్యంలో గద్దర్ గజ్వెల్ స్థానం నుంచి బరిలోకి దిగబోతున్నట్టు ప్రకటించారు. అది కూడా స్వత్రంత్య్ర అభ్యర్థిగా. ఈ నేపథ్యంలో ఒంటేరుకు పడాల్సిన ఓటు బ్యాక్ కచ్చితంగా చీలిపోనుంది. అది కేసీఆర్ గెలుపుని మరింత సులభం చేయనుందని చెబుతున్నారు. గద్దర్ గజ్వెల్ లో బరిలోకి దిగబోతున్నాడని తెలిశాకే.. కేసీఆర్ రెండు స్థానాల్లో పోటీపై ఆ పార్టీ క్లారిటీ ఇచ్చింది. ఇటీవల టీవీ9కి కేటీఆర్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేసీఆర్ గజ్వెల్ నుంచి మాత్రమే పోటీ చేయనున్నారు.

బంపర్ మెజారిటీ గెలవబోతున్నారని కాన్ఫిడెంటు గా చెప్పారు. ఆ కాన్ఫిడెంటు గద్దర్ వల్ల వచ్చిందనే కామెంట్స్ వినబడుతున్నాయి. గద్దర్ బరిలోకి దిగకుంటే కేసీఆర్ గెల్వలేడా ? అంటే గెలుస్తాడు. కానీ వందశాతం చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు గద్దర్ బరిలోకి దిగడంతో గజ్వెల్ లో కేసీఆర్ గెలుపు వందశాతం అని చెప్పవచ్చు. ఐతే, గజ్వెల్ లో గద్దర్ ని బరిలోకి దింపడం వెనక ఏమైనా రాజకీయాలు నడిచాయా.. ? అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. మొత్తానికి.. గద్దర్ కేసీఆర్ ని భారీ మెజారిటీతో గెలిపించబోతున్నారు.. !