కాంగ్రెస్’కు రేవంత్ రెడ్డి రాజీనామా.. !?
తెలంగాణ మహాకూటమిలో సీట్ల సర్థుబాటుపై నేతలు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సీట్ల పంపకంపై సీపీఐ బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తం చేసింది. తాము మూడు సీట్లతో సర్థుకోలేమని ఆ పార్టీ నాయకుడు చాడ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు, కాంగ్రెస్ లోనూ అభ్యర్థుల ఎంపిక పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు.
జనగామ స్థానాన్ని పొన్నాల లక్ష్మయ్యని కాదని టీజె ఎస్ కి ఇస్తున్నారన్న వార్తపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, మల్కాజిగిరి స్థానాన్ని కూడా టీ జె ఎస్ కి అప్పగించడంపై స్థానిక కాంగ్రెస్ నేత గాంధీ భవన్ ముట్టడి చేశారు. అంతేకాదు.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు రేవంత్ రెడ్డి సైతం అభ్యర్థుల ఎంపిక అసహనంతో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.
ఆయన తన వర్గానికి 20సీట్లు అడుగుతున్నారనే వార్తలొచ్చాయ్. ఈ మేరకు ముందస్తు ఒప్పందం తర్వాతే ఆయన కాంగ్రెస్ లో చేరారట. ఇటీవల ఢిల్లీలో జరిగిన కోర్ కమిటీ సమావేశంలోనూ తన వర్గానికి 20సీట్ల కేటాయింపుపై రేవంత్ పట్టుపట్టినట్టు వార్తలొచ్చాయి. ఆయన ఆశించినన్ని సీట్లని కాంగ్రెస్ అధిష్టానం ఇవ్వకపోవడంతో రేవంత్ అసంతృప్తితో ఉన్నారు.
అవసరమైతే తాను రాజీనామా చేస్తానని అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. పోటీనుంచి కూడా తప్పుకుంటానని ఆయన అన్నట్టు వార్తలొస్తున్నాయి. రేవంత్‌రెడ్డి అలకబూనడంతో కాంగ్రెస్ హైకమాండ్ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఈ రోజు మహాకూటమి అభ్యర్థుల తొలి జాబితాని ప్రకటించనుంది. దీంతో రేవంత్ రెడ్డితో సహా అసంతృప్తుల రియాక్షన్ ఏంటన్నది తెలియనుంది.