‘మంత్రి ఈటెల నిజ స్వరూపం’ బయటపెట్టిన కారు డ్రైవర్

తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ నిజ స్వరూపాన్ని ఆయన కారు మాజీ డ్రైవర్‌ బయటపెట్టారు. తెలంగాణ ఉద్యమం పేరుతో టీఆర్ఎస్ నేతలు శవాలపై పేలాలు ఏరుకొన్నారనే ప్రచారం జరిగింది. ఉద్యమం పేరుతో కోట్లు మూటగట్టుకొన్నారు. అమాయకులైన విద్యార్థుల ప్రాణాలని బలితీసుకొన్నారని ప్రతిపక్షాలతో పాటు సామాజిక వేత్తలు ఆరోపించారు. ఇప్పుడు ఈటెల నిజ స్వరూపం బయటపడంతో.. ఆ ప్రచారం నిజమేననిపిస్తోంది.

ఈటెల కారు డ్రైవర్ మల్లేశ్‌యాదవ్‌ పేరు తెలంగాణ ఉద్యమ సమయంలో మారుమ్రోగింది. అసెంబ్లీలో జరిగిన ఘటనలో ఆయన 45 రోజులు జైలు శిక్ష కూడా అనుభవించారు. జైలు నుంచి విడుదలయ్యాక మల్లేష్ యాదవ్ కి సన్మానాలు కూడా జరిగాయి. దాతలు ఆయనకి భారీ డబ్బు ఇచ్చారనే ప్రచారం జరిగింది. ఐతే, ఆనాడు జరిగిన వాస్తవాలని ఇప్పుడు బయటపెట్టాడు మల్లేష్ యాదవ్.

మంత్రి ఈటెల తనకి అన్యాయం చేశాడు. జైలు నుంచి వచ్చాక నా ఉద్యోగం పోయింది. కూలీ పని చేసుకొంటూ కుటుంబాన్ని పోషించుకొంటున్నా. ఆనాడు జైలుకెళ్లిన తర్వాత తనకి దాతలు రూ. 30లక్షలు ఇచ్చారు. ఆ డబ్బు మొత్తం ఈటెలనే తీసుకొన్నారు. ఉద్యోగం నుంచి కూడా తీసేశారని ఆరోపించారు మల్లేష్ యాదవ్. అంతేకాదు.. ఈ ఎన్నికల్లో ఈటెలపై స్వంతంత్య్ర అభ్యర్థిగా నిలబడతానని తెలిపారు మల్లేష్ యాదవ్. ఈటెల నిజ స్వరూపం ఇదన్నమాట. ఈటెల మాదిరిగా టీఆర్ ఎస్ లో ఇంకెంత మంది ఉన్నారో.. మరీ !