బ్రేకింగ్ : తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ శాసనసభకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. కొద్దిసేపటి క్రితమే నోటిఫికేషన్‌ గెజిట్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం విడుదల చేసింది. దీంతో ఈ ఉదయం 11గంటల నుంచి నేమినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ నెల 20, 21 తేదీల్లో నామినేషన్ల పరిశీలిస్తారు. 22వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. డిసెంబర్‌ 7న పోలింగ్‌ జరుగుతుంది. డిసెంబర్‌ 11న ఓట్ల లెక్కింపు చేపడతారు.

మరోవైపు, ఎన్నికల నోటీఫికేషన్ విడుదలైన ఈరోజే టీఆర్ ఎస్ అభ్యర్థులు నామినేషన్లు వేయబోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఈ నెల 14న నామినేషన్ దాఖలు చేయనున్నారు. కేసీఆర్ తో పాటు ముహూర్తాల సెంటిమెంట్స్ ఉన్న మరికొందరు నేతలు 14నే నామినేషన్స్ వేయనున్నారు. ఇక, మహాకూటమి సీట్ల సర్థుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ సాయంత్రానికల్లా క్లారిటీ రానుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి ఎన్నికల నోటీఫికేషన్ విడుదల కావడంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడిక్కింది.