బన్నీ-విజయ్’లది నిజమైన ప్రేమ !
యూత్ మెగాస్టార్ విజయ్ పై మరోసారి ప్రేమని కురిపించాడు స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్. ఆదివారం హైదరాబాద్ లో విజయ్ ‘టాక్సీవాలా’ ప్రీ-రిలీజ్ వేడుక జరిగింది. ఈ వేడుకకి బన్నీని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరోసారి విజయ్ దేవరకొండపై ప్రేమని కురిపించాడు. ‘విజయ్ దగ్గర ఒర్జినాలిటీ ఉంది. కొత్తగా చేస్తున్నాడు. ఆ తీరు జనాలకు నచ్చింది. సెల్ఫ్‌మేడ్ పర్సన్. తనని తాను చెక్కుకున్న శిల్పం విజయ్. సడెన్‌గా స్టార్ అయితే నెగటీవ్ ఫోర్స్ కూడా ఉంటుంది. పట్టించుకోవద్దు విజయ్. అవన్నీ దాటి హిట్స్ కొడతావనే నమ్మకం నాకుంది’ అన్నారు బన్నీ. అంతేకాదు.. ఇష్టమైనవాళ్ల కోసం చేసేది ఏదీ ఇబ్బంది కలిగించదు. విజయ్ స్టైల్లో చెప్పాలంటే ‘నచ్చిన అమ్మాయికి ఎన్నిసార్లు ముద్దు పెట్టినా బోర్ కొట్టదు’ అని చమత్కరించాడు బన్నీ.
విజయ్ కూడా బన్నీపై ఉన్న ఇష్టాన్ని చూపించాడు. ‘గీత గోవిందం’ సినిమా ఫంక్షన్ కి బన్నీ అన్న వచ్చారు. ఇప్పుడు టాక్సీవాలా కోసం మరోసారి వచ్చారు. థ్యాంక్స్ అన్నా. బన్నీలాగా తాను ఈ జీవితంలో డాన్స్ చేయలేను. అలాంటి డాన్స్ ఒకటి తన సినిమాలో ఉండాలంటే అది గ్రాఫిక్స్ తో మాత్రమే సాధ్యమవుతుందని ప్రశంసించాడు. మొత్తంగా బన్నీ-విజయ్ ల ప్రేమ వీరిద్దరి అభిమానుల కడుపునింపేసింది. అంతేకాదు.. టాక్సీవాలకి మెగా అభిమానులు సంపూర్ణ మద్దతు ఉండబోతుందని తెలుస్తోంది.