‘ఇండియన్ 2’ మొదలైంది !


శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘భారతీయుడు’ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. 1996లో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘ఇండియన్ 2’ తెరకెక్కనుంది. తాజాగా, ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకొంది. దీనికి సంబంధించిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇంతకీ ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఎక్కడ జరిగింది. ఎవరెవరు హాజరయ్యారు అనే విషయాలు మాత్రం బయటికి రాలేదు. వాస్తవానికి వచ్చే యేడాది జనవరి 2న ప్రారంభోత్సవం అనే ప్రచారం జరిగింది. ఇంతలోనే ఇండియన్ 2 మొదలైందని తెలుస్తోంది. సమకాలీన రాజకీయ వ్యవస్థలోని లోతుపాతుల్ని సీక్వెల్ లో చూపించబోతున్నారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్‌’లో కమల్ సరసన కాజల్ జతకట్టనుందని చెబుతున్నారు.