ఇప్పట్లో ఇలియానా నోరు తెరవదట

బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. అనే తేడానే లేదు. అన్నింటా #మీటూ ఆరోపణలు వస్తున్నాయి. ఒక్క సినీ పరిశ్రమలోనే కాదు అన్నీ రంగాల్లో వేధింపులు ఉన్నాయన్నది సుస్పష్టం. #మీటూ ఉద్యమానికి మద్దతు తెలిపే వారిలి జాబితా రోజు రోజుకి పెరిగుతోంది.
హీరోయిన్ ఇలియానా కూడా #మీటూపై స్పందించింది. మీటూపై ఇప్పటికిప్పుడు తాను స్పందించను. కానీ, సమయం వచ్చినప్పుడు కచ్చితంగా స్పందిస్తానని తెలింది. ఇంతకీ ఇల్లీ ఇలాంటి వేధింపులు ఎదురయ్యాయా.. ? లేదా.. ? అవి తెలియాలంటే ఇల్లీ నోరు తెరవాలి. ఇప్పట్లో ఇల్లీ నోరు తెరవదట. మరీ.. ఎప్పుడు తెరుస్తుందో.. ? ఎలాంటి సంచలన నిజాలని బయటపెడుతుందో చూడాలి.
ఇక, రవితేజ ‘అమర్ అక్భర్ ఆంటోనీ’ సినిమాతో ఇలియానా టాలీవుడ్ కి రీ-ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా, ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలని కూడా పూర్తి చేసుకొంది. యు/ఎ సర్టిఫికెట్ ని పొందింది. మరీ.. ఈ సినిమాతో ఇల్లీ మరోసారి టాలీవుడ్ లో బిజీ అయిపోతుందా.. ? మళ్లీ టాలీవుడ్ స్టార్ హీరోలతో ఓ రౌండ్ వేస్తుందా.. ?? అన్నది వేచి చూడాలి.