సర్కార్ @200కోట్లు

మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన విజయ్ ‘సర్కార్’ దీపావళీ కానుకగా ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకొచ్చి.. హిట్ టాక్ ని సొంతం చేసుకొన్న సంగతి తెలిసిందే. రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్స్ రూ. 150కోట్లు దాటిపోయాయి. ఇప్పుడా కలెక్షన్స్ రూ. 200 కోట్లు దాటాయి.

ఈ సినిమా యూఎస్ ఏలో రూ. 6.62 కోట్లు, యూకేలో రూ. 3.63 కోట్లు, ఆస్ట్రేలియాలో రూ. 2.21కోట్లు, న్యూజిలాండ్ లో రూ. 20.05 లక్షలు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆరు రోజుల్లో సర్కార్ రూ. 200 కోట్ల క్లబ్ లోకి చేరియింది.

ఇక, ఈ సినిమా చుట్టూ రాజకీయ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. సర్కార్ కి వ్యతిరేకంగా అన్నాడీఎంకే కార్యకర్తలు నిరసనకి దిగారు. ఈ నేపథ్యంలో దర్శకుడు మురగదాస్ ని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకొన్నారు. ఈ నెల 27వరకు మురగదాస్ అరెస్ట్ చేయరాదని తీర్పునిచ్చింది.