వైరల్ : రాఖీ సావంత్ ని ఎత్తిపడేసిన రెజ్లర్

బాలీవుడ్‌ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ కి నోటీ దురద ఎక్కువ. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో, చేష్టలతో వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా, ఆమె మరోసారి వార్తల్లోకెక్కింది. రాఖీ ఏకంగా పంజాబ్‌కు చెందిన ఓ మహిళా రెజ్లర్‌ తో పెట్టుకొంది. రింగ్‌లో ఇద్దరూ తలపడే ముందు తనతో సమానంగా నృత్యం చేయాలని రాఖీ ప్రతి సవాల్‌ విసిరారు.

దీనికి అంగీకరించిన రెజ్లర్‌ రాఖీతో సమానంగా నృత్యం చేసింది. అనంతరం రాఖీ సావంత్‌ను మహిళా రెజ్లర్ తన భుజాలమీదకు ఎత్తుకుని అమాంతం కింద పడేసింది. దీంతో సుమారు 8 నిమిషాల పాటు రాఖీ బాధతో విలవిలలాడిపోయారు. వెంటనే నిర్వాహకులు స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాఖీకి ఇలా జరగాల్సిందేనని నెటిజర్స్ కామెంట్స్ చేస్తున్నారు.