రోబో ‘2.ఓ’ సెన్సార్ రివ్యూ
‘2.ఓ’ సినిమాతో దర్శకుడు శంకర్ మరోసారి మేజిక్ చేయబోతున్నాడు. ఈ విషయం ఇటీవల విడుదలైన 2.ఓ ట్రైలర్ తో అర్థమైంది. ట్రైలర్ ని విజువల్ వండర్ గా తీసుకొచ్చారు. హాలీవుడ్ రేంజ్ లో ఉన్న ఈ సినిమా ఇండియన్ సినిమా స్థాయిని పెంచేలా ఉంటుందని చెబుతున్నారు. ఆ మేజిక్ ని ఈ నెల 29న ప్రేక్షకులు చూడబోతున్నారు.
తాజాగా, 2.ఓ సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకొంది. యు/ఎ సర్టిఫెకెట్ ని పొందింది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ట్విట్ చేసింది. ఇండియన్ బిగ్గెస్ ఫిల్మ్ రాబోతుందని కామెంట్ పెట్టింది. సినిమా అదిరిపోయింది. హాలీవుడ్ రేంజ్ లో ఉందని సినిమా చూసిన సెన్సార్ సభ్యుల టాక్. ఇందులోని విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకుడి ఆశ్చర్యంలో ముంచేత్తుతాయని చెబుతున్నారు.
Censored & ready to stun! #2Point0 censored with U/A! Don't keep calm, India's biggest film is on its way…#2Point0FromNov29 @rajinikanth @akshaykumar @shankarshanmugh @iamAmyJackson @arrahman pic.twitter.com/U30LS0p4U0
— Lyca Productions (@LycaProductions) November 13, 2018