కాజల్’కి చోటా ముద్దుపై వివరణ


హీరోయిన్ కాజల్ కు పబ్లిక్ గా చోటా ముద్దు సీన్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ‘కవచం’ టీజర్ రిలీజ్ వేడుకలో వేదికపై కాజల్ ని సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు ముద్దాడేశాడు. దాన్ని కాజల్ కూడా ఎంజాయ్ చేసింది. ఐతే, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చోటా కంట్రోల్ చేసుకోకపోవడంపై కామెంట్స్ వచ్చిపడుతున్నాయి. ఇంతకీ చోటా ఎందుకు ముద్దు పెట్టినట్టు ? అంటూ ఆరా తీస్తున్నారు. తాజాగా, దీనిపై చోటా చిన్నిపాటి వివరణ ఇచ్చారు.

చోటాకి హీరోయిన్ సౌందర్య అంటే చాలా ఇష్టమట. ఆమె తర్వాత చోటా అంతలా అభిమానించే హీరోయిన్ కాజల్ నే. ఆయన కాజల్ తో కలసి చాలా సినిమాలకు పని చేశారు. ఆమె పనితనాన్ని మెచ్చుకునేందుకే ఆమెను ముద్దు పెట్టుకున్నాడట. ఐతే, అది పబ్లిక్ గా చేయాలా.. ? అంటూ నెటిజర్స్ మండిపడుతున్నారు. గతంలోనూ చోటా హీరోయిన్స్ తో ఇలా ప్రవర్థించిన సందర్భాలున్నాయి. పబ్లిక్ గానే చోటా ఇలా ముద్దులిస్తుంటే ప్రమోటుగా ఇంకెన్ని చేస్తాడో.. ! అసలు #మీటూ ఉద్యమం ఉప్పెనలా ఉప్పొంగుతోంది. చోటా జర జాగ్రత్తగా ఉంటే మంచిదేమో.. !!