దీపికా-రణ్ వీర్ పెళ్లి.. అప్పుడే వివాదాలు !

బాలీవుడ్ ప్రేమజంట దీపికా పదుకొనె – రణ్ వీర్ సింగ్ లు పెళ్లితో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఈ నెల 14, 15 తేదీల్లో ఇటలీలోని లేక్ కోమోలోని విల్లా డెల్ బాల్బియానెల్లోలో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. ఈ జంట ఈ నెల 28న ముంబైలో వివాహ విందు ఇవ్వబోతుంది. ఐతే, వీరి పెళ్లిపై వివాదం రాజుకొంది. పెళ్లి సందర్భంగా నిర్వహించిన ‘ఆనంద్ కరాజ్’ కార్యక్రమం సిక్కు సంప్రదాయాలకు విరుద్ధంగా జరిగిందని ఇటాలియన్ సిక్ ఆర్గనైజేషన్ ఆరోపించింది.

సిక్కుల పవిత్ర గ్రంథమైన ‘గురుగ్రంథ్ సాహిబ్’ను గురుద్వారాలో తప్ప మరెక్కడా తీసుకోకూడదన్న నిబంధన ఉంది. ఈ నిబంధనని దీపిక రణ్ వీర్ ఉల్లఘించారు. దీనిపై ‘అకల్ తఖ్త్ జతేదార్’కు ఫిర్యాదు అందింది. దీనిపై సిక్కు మతపెద్దలు ఏ నిర్ణయం తీసుకొంటారన్నది చూడాలి. ఇక, పెళ్లి తర్వాత దీపిక రణ్ వీర్ మీసాలన్ కట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.