వీక్ డేస్’లో పీక్ కలెక్షన్స్

విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. వీక్ డేస్ లో పీక్ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతోంది. సోమ, మంగళ, బుధవారం అన్ని చోట్లా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో అదరగొడుతోంది. దీనిపై నిర్మాత ఎస్ కెఎన్ సంతోషం వ్యక్తం చేశారు. ‘వీక్ డేస్‌లో మా సినిమా ఏ మాత్రం వీక్ కాలేదు. కలెక్షన్స్ పీక్ రేంజికి వెళ్లాయి. బుధవారం కూడా అన్ని చోట్లా వసూళ్లు అదరగొట్టింది’ అని ట్విట్ చేశారు. అంతేకాదు.. నవంబర్ 23న భీమవరంలో గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించబోతున్నట్టు తెలిపారు.

విడుదలకి ముందే టాక్సీవాలా లీకైంది. ఐతే, ఆ ఎఫెక్ట్ ఏమాత్రం సినిమాపై పడలేదు. తొలిరోజే బ్రేక్ ఈవెన్ అందుకొంది. ఇప్పటివరకు రూ. 25కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. కలెక్షన్స్ ఇంకా నిలకడగా ఉండటంతో డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ లాభాలు తెచ్చిపెట్టేలా కనబడుతోంది. బుధవారం బెంగుళూరులో టాక్సీవాలా హయ్యెస్ట్ గ్రాస్ సాధించింది. అక్కడి లోకల్ హీరోల సినిమాలకు సైతం టాక్సీవాలా చుక్కలు చూపించింది. టాక్సీవాలా స్పీడును ఇతర సినిమాలు అందుకోలేక పోవడం హాట్ టాపిక్ గా మారింది.

రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ – ప్రియాంక జువాల్కర్ జంటగా ‘టాక్సీవాలా’ తెరకెక్కింది. మాళవిక నాయర్, కళ్యాణి , మధు నందన్ కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.