త్రివిక్రమ్’పై సునీల్ అసంతృప్తి !

త్రివిక్రమ్ – సునీల్ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు స్నేహితుడు త్రివిక్రమ్ పై సునీల్ అసంతృప్తితో ఉన్నట్టు సమాచారమ్. ఇందుకు కారణమేంటీ ? అంటే.. కమెడియన్ గా సునీల్ రీ-ఎంట్రీని త్రివిక్రమ్ సరిగ్గా ప్లాన్ చేయలేదట. టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా ఎదిగిన సునీల్.. హీరోగా టర్న్ తీసుకొన్న విషయం తెలిసిందే. హీరోగా ఒకట్రెండు విజయాలు అందుకొన్న సునీల్ ని.. ఆ తర్వాత వరుసప్లాపులు పకలరించాయి. హీరోగా సునీల్ ని భరించలేని స్థితికి ప్రేక్షకులు చేరిపోయారు. ఈ నేపథ్యంలో సునీల్ కమెడియన్ గా రీ-ఎంట్రీ ఇవ్వక తప్పలేదు.

ఎన్ని ఎదవ యేషాలు వేసిన త్రివిక్రమ్ ఉన్నాడులే అనే భరోసా తనకుందని ఓ సందర్భంలో సునీల్ అన్నాడు. అది నిజమే. సునీల్ రీ-ఎంట్రీని స్వయంగా త్రివిక్రమ్ నే ప్లాన్ చేశాడు. ఎన్టీఆర్ ‘అరవింద సమేత’లో సునీల్ కోసం ఓ పాత్రని రాశాడు. ఈ సినిమా తర్వాత మళ్లీ కమెడియన్ గా బిజీ అయిపోతానని సునీల్ ఆశలు పెట్టుకొన్నాడు. కానీ అది జరగలేదు. అరవిందలో సునీల్ పాత్ర సాదాసీదాగా అనిపించింది. వాస్తవానికి సునీల్ నవ్వించే బోలోడు సన్నివేశాలు అరవిందలో ఉన్నాయట.

అవన్నీ కూడా ఆఖరి నిమిషయంలో ఎడిటింగ్ టేబుల్ దగ్గరలేపేశారట. దీనికి తోడు కమెడియన్ గా రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత సునీల్ నటించిన రెండో చిత్రం అమర్ అక్భర్ ఆంటోనీ ప్లాప్ అయ్యింది. ఇందులోనూ సునీల్ పాత్రకి పెద్దగా స్పందన రాలేదు. దీంతో సునీల్ పరిస్థితి దారుణంగా తయారైంది. అసలే ప్లాపు హీరోగా ముద్రపడిపోయింది. ఇప్పుడు కమెడియన్ గా అవే ప్లాపులు పలరిస్తున్నాయనే బాధలో ఉన్నాడు.

ఈ బాధని సునీల్ త్రివిక్రమ్ దగ్గర వెల్లగక్కడాట. దీంతో.. తన తదుపరి సినిమాలో ఓ మంచి పాత్ర ఇస్తానని మాటిచ్చాడట త్రివిక్రమ్. బన్నీతో త్రివిక్రమ్ తదుపరి సినిమా ఉండనుంది. ఇందులో సునీల్ కి బెర్త్ ఖాయం అయిందన్న మాట. మరీ.. స్నేహితుడి కెరీర్ ని నిలబెట్టేందుకు త్రివిక్రమ్ ఎలాంటి పాత్ర రెడీ చేస్తాడన్నది చూడాలి. ఇక, బన్నీ తర్వాత త్రివిక్రమ్ మహేష్ తో సినిమా చేయాల్సిఉంది. ఇందులోనూ సునీల్ కి ఓ మంచి పాత్ర దక్కినట్టే. మొత్తానికి సునీల్ బాధ్యత త్రివిక్రమ్ దే.