టీఆర్ఎస్’కు మరో షాక్

మరో పదిరోజుల్లో ఎన్నికలు ఉండగా టీఆర్ఎస్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఖమ్మం టీఆర్ఎస్ అధ్యక్షుడు బుడాన్ బేగ్ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఆయన టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. పోతూ పోతూ బుడాన్ బేగ్ మంత్రి కేటీఆర్ ని బదనాం చేశారు. ఖమ్మంలో మంత్రి తుమ్మల పట్టుని కేటీఆర్ ఓర్వలేకపోతున్నారు. జిల్లాలో 10 స్థానాలల్లో గెలవాల్సిన తెరాసని కేటీఆర్ కావాలనే దెబ్బతిస్తున్నారని ఆరోపించారు.

తాజాగా, కూకట్ పల్లి టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ చార్జ్ గొట్టుముక్కల పద్మారావు పార్టీ, పదవికి రాజీనామా చేశారు. కేసీఆర్ తెలంగాణ వాదాన్ని పూర్తిగా విస్మరించి, పార్టీని పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఇంత కాలం ఓపికగా ఎదురు చూశా. ఇక పార్టీ బాగుపడే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో పార్టీ సభ్యత్వానికి, నియోజకర్గ ఇన్ చార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు గొట్టుముక్కల తెలిపారు. ఎన్నికల ముందు జరుగుతున్న ఈ రాజీనామాల పర్వం టీఆర్ఎస్ పెద్ద సమస్యగా మారిందని చెప్పవచ్చు.

మరోవైపు, కూకట్ పల్లిలో మహాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసిని ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అందరినీ కలుపుకొని ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆమెకి కాంగ్రెస్, టీఆర్ ఎస్ మద్దతు దారులు సపోర్టు చేస్తుండటం విశేషం. సుహాసిని గెలుపుని టీ-టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. సుహాసిని గెలుపు బాధ్యతని చంద్రబాబు, బాలయ్య తీసుకోవడంతో… పరిస్థితి విభిన్నంగా కనిపిస్తోంది. టీడీపీ ఆపరేషన్ లో భాగంగానే కూకట్ పల్లి టీఆర్ ఎస్ అధ్యక్షుడు గొట్టుముక్కల పార్టీని వీడినట్టు సమాచారమ్.