జాహ్నవి చెల్లెలుకు రేప్ బెదిరింపులు


అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి కపూర్ టాలీవుడ్ కి కనెక్ట్ అయిపోయింది. ఆమెని తెలుగు సినిమాలో నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి కూడా జాహ్నవి కోసం ట్రై చేస్తున్నారంట. #RRR కోసం జాహ్నవి అయితే బాగుంటుందని భావిస్తున్నారంట. జాహ్నవి కూడా తెలుగు సినిమాపై మంచి అభిప్రాయంతో ఉంది. టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ అంటే ఇష్టం. ఆయనతో నటించాలని ఉందనే కోరికని వెలుబుచింది.

ఇటీవల జాహ్నవి కపూర్ సోదరుడు, బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తో కలిసి ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ షో పాల్గొన్నారు. ఈ షోలే విజయ్ దేవరకొండపై ఇష్టాన్ని తెలియజేసింది జాహ్నవి. అవకాశం వస్తే విజయ్ లా మారిపోతానని తెలిపింది. ఈ షోలో అర్జున్ కపూర్-జాహ్నవిలకి ఓ పోటీ పెట్టారు కరణ్. జాహ్నావి కి ఆమె చెల్లెలు అన్షు సహకరించింది. అయినా.. అర్జున్ కపూర్ నే గెలిచారు. జాహ్నవికి అన్షు సరిగ్గా సహకరించకపోవడంపై.. ఆమెని నెటిజన్స్ టార్గెట్ చేశారు. ఏకంగా అన్షు ని రేప్ చేస్తామని బెదిరింపులకి దిగారు.

ఈ బెదిరింపులపై జాహ్నవి స్పందించింది. నైతిక విలువలను తుంగలో తొక్కి దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. అది సరికాదు అని జాహ్నవి అభిప్రాయపడింది. సోదరి అన్షులాపై వచ్చిన కామెంట్లపై అర్జున్ కపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ చెల్లికి, అమ్మకు ఇలాంటి పరిస్థితి రావొద్దని భావిస్తాను అని అర్జున్ కపూర్ గట్టిగా సమాధానం ఇచ్చారు.