‘2.ఓ’ అడ్డుగీత తొలగింది.. !


భారతీయ సినిమాను హాలీవుడ్‌ స్థాయికి తీసుకెళ్లిన దర్శక దిగ్గజం శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘2.ఓ’. ఇప్పుడీ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. రేపే (నవంబర్ 29) చిట్టి థియేటర్లలో సునామీ సృష్టించేందుకు రాబోతున్నాడు. ‘2.ఓ’ రాకతో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లోనూ స్టార్ హీరోల సినిమాలని వాయిదా వేసుకొన్నారు. 2.ఓ పై నెలకొన్న క్రేజ్ అలాంటిది. ఇలాంటి సినిమాకు పోటీ దిగింది ‘భైరవగీత’. దీనిపై రాంగోపాల్ వర్మ గర్వంగా చెప్పుకొన్నాడు.

కొత్త దర్శకుడు సిద్ధార్థ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. కన్నడ నటుడు ధనంజయ కథానాయకుడు. ఇర్రా కథానాయిక. రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవరిస్తున్నారు. అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తోంది. రవి శంకర్‌ సంగీతం అందించారు. ఈ సినిమాని ఈ నెల 30న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేశారు. ఐతే, ఇప్పుడీ సినిమా రిలీజ్ వాయిదా పడింది.

సెన్సార్ చిక్కులు, కొన్ని సాంకేతిక కారణాలవ వలన భైరవగీత వాయిదా వేస్తున్నట్టు వర్మ ట్విట్ చేశారు. ఈ నేపథ్యంలో సినిమా డిసెంబర్ 7న విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. తెలుగులో ‘2.ఓ’ భైరవగీత అడ్డుగా ఉందని చెప్పుకొన్నారు. ఇప్పుడు ఆ గీత అడ్డు తొలగింది. దీంతో తెలుగు 2.ఓ కు అడ్డేలేకుండా పోయింది. అసలు పోటీయే లేని చిట్టి ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తాడనేది చూడాలి.