‘2.ఓ’ ట్విట్టర్ రివ్యూ

థియేటర్లలో చిట్టి సునామీ మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘2.ఓ’ ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. రికార్డు స్థాయిలో బెనిఫిట్ షోలు పడిపోయాయి. ఫస్ట్ టాక్ బయటికొచ్చేసింది. పలువురు ట్విట్టర్ ద్వారా సినిమా టాక్ ని పంచుకొంటున్నారు. వారి ట్విట్టర్ రివ్యూపై ఓ లుక్కేద్దాం పదండీ.. !

ఇండియన్ సినిమా స్థాయిని పెంచే సినిమా ఇది. హాలివుడ్ రేంజ్ లో 2.ఓ ఉండబోతుందని చెప్పారు. ఐతే, సినిమా ఆ అంచనాలని మించేలా ఉందట. అంటే హాలీవుడ్ రేంజ్ ని మించిపోయిందని అర్థం. విజువల్ ఎఫెక్ట్స్ దిమ్మతిరిగే రేంజ్ లో ఉన్నాయట. విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు శంకర్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే పై ముచ్చపడుతున్నారు సినిమా చూస్తున్న ప్రేక్షకులు.

విజువల్ల్ గా డబుల్ స్టన్నింగ్ అని చెబుతున్నారు. అక్షయ్ కుమార్ ఎంట్రీ అదిరిపోయింది. సూపర్ స్టార్ రజనీకాంత్ చిట్టి, వాసిగా క్లాసిక్ గా కనిపించారు. ఫస్టాఫ్ లో ఎలాంటి పాటలు లేవు. ఇక, సెకాంఢాఫ్ లో ప్రారంభం నుంచే సినిమా జెడ్ స్వీడు అందుకొంది. ప్రతి సీన్ క్లైమాక్స్ రేంజ్ లో అనిపిస్తోండి. మొత్తానికి.. ఎక్స్ పెక్టేషన్స్ మించేలా 2.ఓ ఉంది. ఇది భారతీయ సినిమా గర్వపడే సినిమా. మెగా బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం. కలెక్షన్స్ లోనూ ఇండియన్ నెం. 1 సినిమా నిలుస్తుందని ట్విట్ చేస్తున్నారు.