కేసీఆర్ మూడో విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారు

టీఆర్ఎస్ అధినేత, ఆపదర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ జెడ్ స్వీడుతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఎనిమిది, పది బహిరంగ సభలో పాల్గొని ప్రసగిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓటెసేటప్పుడు ఆగం కావొద్దు. ప్రధాన పోటీ టీఆర్ఎస్, మహాకూటమి మధ్యే ఉంది. నాలుగున్నర యేళ్ల చేసిన అభివృద్ధి మీ ముందే ఉంది. ఆలోచించి ఓటేయాలని ఓటర్లని విజ్ఝప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ రెండు దఫాలుగా ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఇప్పుడు మూడో విడత షెడ్యూల్ ఖరారైంది.

డిసెంబర్ 2 నుంచి కేసీఆర్ మూడో దఫా ఎన్నికల ప్రచారం మొదలుకానుంది. డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 4 వరకు ఆయన ప్రచారం జరగనుంది. మూడు రోజుల్లో మొత్తం 14 సభల్లో కేసీఆర్ ప్రసంగించనున్నారు. డిసెంబర్ 2న నాగర్ కర్నూల్, చేవెళ్ల, పటాన్ చెరువు, హైదరాబాద్ లలో నిర్వహించే బహిరంగసభల్లో కేసీఆర్ ప్రసంగిస్తారు. డిసెంబర్ 3న సత్తుపల్లి, మధిర, కోదాడ, మిర్యాలగూడ, నల్లగొండ సభలలో, డిసెంబర్ 4న అలంపూర్, గద్వాల, మక్తల్, కొడంగల్, వికారాబాద్ లలో నిర్వహించే ప్రచార సభల్లో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.