‘2.ఓ’.. బ్రేకింగ్ ఆల్ రికార్డ్స్ !

థియేటర్స్ లో చిట్టి రోబో సునామీ మళ్లీ మొదలైంది. బాక్సాఫీసు రికార్డులన్నీ బద్దలు కొట్టబోతుంది. భారీ అంచనాల మధ్య గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘2.ఓ’ని మెగా బ్లాక్ బస్టర్ హిట్ గా ప్రేక్షకులు తేల్చేశారు. 2.ఓ – మాస్టర్ పీస్. విజువల్ వండర్. మెగాబ్లాక్ బస్టర్ హిట్ అని రివ్యూలు చెప్పేశాయి. ఈ ఆనందాన్ని 2.ఓ ని హిందీలో విడుదల చేసిన దర్శక-నిర్మాత కరణ్ జోహార్ ప్రేక్షకులతో పంచుకొన్నారు. ‘ఈ సినిమాలో భాగస్వామ్యం అయినందుకు గర్వంగా పీలవుతున్నా’నని ట్విట్ చేశారు.

‘2.ఓ’ రివ్యూ రేటింగ్స్ తో కూడిన పోస్టర్ జతక చేశాడు. ఇందులో తరణ్ ఆదర్శ్, కోమల్ నాథ్ లు ఇచ్చిన సింగిల్ రివ్యూస్ తో పాటు టాప్ వెబ్ సైట్స్ ఇచ్చిన రివ్యూ రేటింగ్స్ ని పేర్కొన్నారు. కరణ్ చేసిన ఈ ట్విట్ ని దర్శకుడు శంకర్ రీ-ట్విట్ చేశారు.
ఇక, బాలీవుడ్ లో 2.ఓ రికార్డు కలెక్షన్స్ సాధించినట్టు సమాచారమ్. తొలిరోజు రూ. 25కోట్లకిపైగా వసూలు చేసినట్టు తెలుస్తోంది.

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 2.ఓ లో రజనీకాంత్, అక్షయ్ కుమార్, ఎమీ జాక్సన్ కీలక పాత్రల్లో నటించారు. దాదాపు రూ. 600కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమా కోసం 3జీ టెక్నాలజీ, 4డి సౌండ్ ని వాడారు. ఇక, ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ రూపంలో ఏకంగా రూ. 375కోట్లు రాబట్టినట్టు సమాచారమ్.