నాని చిన్నపిల్లాడు.. ఆపులేకపోయాడు !
నాని ఆపులేకపోయాడు. వెంటనే వెళ్లి ‘2.ఓ’ సినిమాని చూసేశాడు. రజనీ సినిమా ‘2.ఓ’ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడలేకపోయానని గురువారం ఉదయమే ఆవేదన వ్యక్తం చేశాడు నాని. ఈ సారి కుదరలేదు. ఉదయమే లేచి షూటింగ్ కి వెళ్లాల్సి వచ్చింది. సమయం దొరగ్గానే 2.ఓ చూసేస్తానని ట్విట్ చేసిన సంగతి తెలిసిందే. గురువారం రాత్రికే నాని సమయం దొరికింది. కాదు.. దొరకబుచ్చుకొన్నాడు.
వెళ్లి 2.ఓ చూసేశాడు. చూశాక ఆ ఆనందం ఆపులేకపోయాడు. ఆ ఆనందాన్ని తెలియజేస్తూ ట్విట్ చేశాడు. ‘చాలాకాలం తర్వాత చిన్నాపిల్లాడిలా మారిపోయా. బాక్సాఫీసుకి దిగిపోద్ది. ఇది శంకర్ సినిమా’ అని ట్విట్ చేశారు. ఇప్పుడు నాని ట్విట్ వైరల్ గా మారింది. అసలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా 2.ఓ ని చూసేందుకు ఆపులేకపోయాడు నాని. మిగితా వారి పరిస్థితి కూడా ఇదే. అందుకే థియేటర్స్ వెళ్లి సినిమా చూడండి. పైరసీలో మాత్రం చూడొద్దు. చూస్తే మీకే నష్టం. ఆ ఫీల్ మిస్సవుతారు.
#2point0 @rajinikanth sir @akshaykumar sir @shankarshanmugh sir 🙏🏼👏
BOXOFFICE KI DHIGIPODHII
Felt like a kid after long time 🙂
This is S-H-A-N-K-A-R-R-R-R pic.twitter.com/JMFbfmPeZe— Nani (@NameisNani) November 29, 2018