కొడంగల్ ఎన్నిక వాయిదా !
ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి దూకుడు చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సంచల వ్యాఖ్యలకి కెరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. ప్రచారంలో భాగంగా బ్రేకింగ్ అండ్ షాకింగ్ న్యూస్ చెబుతున్నారు. ఇటీవల ఇద్దరు టీఆర్ ఎస్ ఎంపీలు రాజీనామా చేయబోతున్నట్టు రేవంత్ చెప్పారు. దమ్ముంటే వారిని ఆపాలని కేసీఆర్ కి సవాల్ విసిరాడు. రేవంత్ చెప్పినట్టుగానే టీఆర్ఎస్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ వీడారు. ఇప్పుడు మరో రెండు సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్ది.
ఇందులో ఒకటి రేవంత్ రెడ్డి హత్యకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసిందట. ఇందుకోసం శిక్షితులైన కొందరు పోలీసులను రంగంలోకి దించారు. దీని సంబంధించి తన వద్ద పూర్తి సమాచారం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు రేవంత్. ఇక రెండోవది. కొడంగల్ ఎన్నిక వాయిదా. శుక్రవారం నుంచి కొడంగల్ లో భారీ ఎత్తున డబ్బు దొరకబోతుంది. ఆ సాకు చూపి కొడంగల్ ఎన్నిక వాయిదా వేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు రేవంత్. మరీ.. రేవంత్ చేసిన ఈ రెండు సంచలన వ్యాఖ్యలు రాజకీయాలని మరింత హీటెక్కిస్తున్నాయి.