రేవంత్ రెడ్ది అరెస్ట్ వెనక !

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంటు రేవంత్ రెడ్డి అరెస్ట్’తో కొడంగల్ టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. తెల్లవారుజామున 3గంటల సమయంలో రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోని తీసుకొన్నారు. తలుపులు బద్దలు కొట్టి, రేవంత్ ఇంట్లోకి పోలీసులు ప్రవేశించారు. ఏకంగా ఆయన బెడ్ రూంలోకి వెళ్లారు. బలవంతంగా రేవంత్ రెడ్డిని అదుపులోని తీసుకొన్నారు. దానికి సంబంధించిన వీడియోలు బయటికొచ్చారు. దీనిపై రేవంత్ భార్య గీత తీవ్ర నిరసనని వ్యక్తం చేసింది. తమ మనోభావాలని దెబ్బతీస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది. రేవంత్ అభిమానులు, కార్యకర్తలు సంయమనం పాటించాలి. ఓటుతోనే కేసీఆర్ కి బుద్ది చెప్పాలని సూచించారు. ఐతే, రేవంత్ అరెస్ట్ పై ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ? అంటే ఈరోజు కొడంగల్ లోని కోస్గీలోప్రజాఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనబోతున్నారు. కేసీఆర్ కొడంగల్ పర్యటనని అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇందులో భాగంగా కొడంగల్ బంద్ కి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్ది పోలీసులు అదుపులోని తీసుకొన్నారు. నిజంగా రేవంత్ రెడ్డి వర్గీయులు సీఎం కేసీఆర్ ని అడ్డుకొంటే, ఆ ప్రయత్నంలో ఏమాత్రం విజయవంతం అయినా.. ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పడనుంది. కేవలం మూడు రోజుల్లో పోలింగ్ ఉండటం అది టీఆర్ ఎస్ కి పెద్ద దెబ్బగా మారే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా.. శాంతి భద్రతల పేరుతో ఆయన్ని ముందస్తు అరెస్ట్ చేసినట్టు సమాచారమ్.